పాకిస్థాన్ లోని ఐసిస్ స్థావరాల
Actor ProfilePolitician

పాకిస్థాన్ లోని ఐసిస్ స్థావరాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాకిస్థాన్ లోని ఐసిస్ స్థావరాలపై డ్రోన్ దాడులు
Eenadu27 Aug 2026
పాకిస్థాన్ లోని ఐసిస్ స్థావరాలపై డ్రోన్ దాడులు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఐసిస్‌ స్థావరాలపై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌ దాడులు (Drone Attacks) చేసింది. బలోచిస్థాన్‌లోని పిషిన్‌ జిల్లా సరనాన్‌ వద్ద ఉన్న ఐసిస్‌ జాయింట్‌ సెంటర్‌ను, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. తూర్పు అఫ్గాన్‌ (Afghanistan)లోని పలు ప్రాంతాలపై సోమవారం పాక్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా ఈ డ్రోన్‌ దాడులు చేపట్టినట్లు తెలిపింది. ఇందులో పలువురు ఇస్లామిక్ స్టేట్ (IS) గ్రూపు సభ్యులు మరణించినట్లు పేర్కొంది. తమకు ముప్పుగా మారిన ఏ ఒక్క టార్గెట్‌ను వదిలిపెట్టబోమని అఫ్గాన్‌ రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా.. అఫ్గాన్‌ నుంచి వచ్చిన నాలుగు డ్రోన్‌లను అడ్డుకున్నట్లు పాక్‌ (Pakistan military) సైన్యం వెల్లడించింది. సరనాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల సమీపంలో డ్రోన్‌ శకలాలను గుర్తించినట్లు తెలిపింది. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తాలిబన్లను హెచ్చరించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాక్‌ భూభాగాలను వాడుకొని తమపై దాడులు చేస్తున్నారన్న అఫ్గాన్‌ ఆరోపణలను పాకిస్థాన్‌ ఖండించింది. అయితే, తాజా డ్రోన్‌ దాడుల్లో ప్రాణనష్టాన్ని మాత్రం ఈ దేశం వెల్లడించలేదు. డ్రోన్ దాడులపై అఫ్గాన్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, దానికి తగిన విధంగా బదులు చెబుతామని పాక్‌ సైన్యం హెచ్చరించింది. ఇదీ చదవండి: భారత్‌కు పొరుగున కరకు దేశాలు! గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ప క స థ న ల న ఐస స స థ వర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in