
Eenadu•25 Aug 2026
పాకిస్థాన్ లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ దాడులుపాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులలోని ఐసిస్ స్థావరాలను లక్ష్యాలుగా చేసుకొని అఫ్గానిస్థాన్ వైమానిక దళం దాడులు చేసింది. అఫ్గాన్ పౌరులపై దాడులకు ప్రణాళికలు రచించడానికి ఈ స్థావరాలను ఉపయోగిస్తున్నారని అందుకే దాడులు చేసినట్లు అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలియజేసింది. అఫ్గాన్ విమానాలు బలూచిస్తాన్‌లోని పిషిన్ జిల్లాలోని సరనాన్ ప్రాంతంలో ఉన్న ఐసిస్ సంయుక్త కేంద్రాన్ని, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని పలు ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశారు. పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ దాడులు