
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శనివారం మధ్యాహ్నం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బన్నూ జిల్లాలోని మార్కా బేరా ప్రాంతంలో చోటుచేసుకుంది. పాకిస్థాన్: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఈరోజు (శనివారం) మధ్యాహ్నం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బన్నూ జిల్లాలోని మార్కా బేరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బన్నూ జిల్లా పోలీస్ అధికారి (డీపీవో) యాసిర్ అఫ్రిది తెలిపిన వివరాల ప్రకారం, సాధారణ ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. హతి ఖేల్ గ్రామం నుంచి బన్నూ నగరానికి ప్రయాణికులతో కూడిన ఓ వాహనం వెళ్తోంది. అయితే, మార్కా బేరా వద్దకు వాహనం రాగానే రోడ్డు పక్కన అమర్చిన ఐఈడీ ఒక్కసారిగా పేలింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత సహాయక చర్యల కోసం పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. వారిని లక్ష్యంగా చేసుకుని మరో బాంబు దాడి జరిగినట్లు డీపీవో యాసిర్ అఫ్రిది తెలిపారు. ఈ పేలుడులో మరో ఇద్దరు మృతిచెందారు. రెండు బాంబు దాడుల్లో మొత్తం ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి పోలీసులు తరలించారు. బాంబు పేలుళ్ల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి, పేలుళ్లకు సంబంధించిన సాక్ష్యాల కోసం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు భద్రతా దళాలు మార్కా బేరా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాగా, ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. ఈ ఘటనను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుళ్లలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత