పాక్ తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
Actor ProfilePolitician

పాక్ తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్

Total News1
Movie Updates0
Sources1
పాక్ తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
Sakshi14 Jun 2026
పాక్ తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 14) బిగ్‌ ఫైట్‌ జరుగుతుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌-పాక్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగ.. ఆమెకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్‌), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్‌ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సదియా ఇక్బల్‌ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. చరిత్ర సృష్టించిన హర్మన్‌ ఈ మ్యాచ్‌లో హర్మన్‌ ఓ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టింది. భార‌త్ త‌ర‌ఫున టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు (762) చేసిన బ్యాట‌ర్‌గా అవతరించింది. ‌ఇప్పటివ‌ర‌కు ఈ రికార్డు మిథాలీరాజ్ ( 726) పేరిట ఉండింది. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో హ‌ర్మ‌న్, మిథాలీ త‌ర్వాతి స్థానాల్లో స్మృతి మంధాన (592), జెమీమా రోడ్రిగ్స్ (408), పూనమ్ రౌత్ (375) ఉన్నారు. సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు) యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..? కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన బ్యాగ్ తో