పీఎం మోదీతో రామ్ చరణ్.. పుత్రోత్సాహంలో చిరు.. ట్వీట్ వైరల్
Actor ProfilePolitician

పీఎం మోదీతో రామ్ చరణ్.. పుత్రోత్సాహంలో చిరు.. ట్వీట్ వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పీఎం మోదీతో రామ్ చరణ్.. పుత్రోత్సాహంలో చిరు.. ట్వీట్ వైరల్
Chitrajyothy13 Jul 2026
పీఎం మోదీతో రామ్ చరణ్.. పుత్రోత్సాహంలో చిరు.. ట్వీట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆ విషయాన్ని ‘పెద్ది బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్’ వేడుకలో చెప్పిన చిరంజీవి.. తాజాగా మరోసారి ట్వీట్ రూపంలో తెలియజేశారు. ఈ ట్వీట్‌తో పాటు ప్రధాని మోదీతో రామ్ చరణ్ ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన తన కుమారుడు రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (Peddi) చిత్రం సెన్సేషనల్ సక్సెస్‌ని అందుకోవడంతో ఎంతో సంతోషంగా ఉన్న చిరంజీవి.. ఆ సినిమాకు సంబంధించి పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. తాజాగా రిపబ్లిక్ సమ్మిట్ 2026 వేడుకలో ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేకంగా రామ్ చరణ్‌‌‌‌ను అభినందించడంతో.. చిరంజీవి ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో.. తాజాగా వచ్చిన ట్వీట్ చూస్తే తెలుస్తోంది. ఈ ట్వీట్‌లో.. ‘‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను ‘New Age Megastar’ అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక మంగళవారం జరిగిన ‘పెద్ది బ్లాక్‌బస్టర్ ఈవెంట్’లోనూ చిరంజీవి తన పుత్సోత్సాహాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చరణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ తనకి న్యూ ఏజ్ మెగాస్టార్ అనే టైటిల్ ఇచ్చారు. నాకు ఎంతో

ప ఎ మ ద త ర మ చరణ ప త ర త స హ ల చ ర ట వ ట వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in