పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూలై 2 వరకు ఆన్ లైన్ సేవలు బంద్
Actor ProfilePolitician

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూలై 2 వరకు ఆన్ లైన్ సేవలు బంద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూలై 2 వరకు ఆన్ లైన్ సేవలు బంద్
Zee Telugu29 Aug 2026
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూలై 2 వరకు ఆన్ లైన్ సేవలు బంద్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ.. టెక్నికల్ అప్ గ్రేడ్ కారణంగా జులై 1,2026 రాత్రి నుంచి ఆన్ లైన్ సర్వీసులన్నింటినీ నిలిపివేయనుంది. పీఎఫ్ క్లెయిమ్స్, పాస్ బుక్ డౌన్ లోడ్స్, యూఏఎన్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఈపీఎఫ్ఓ పోర్టల్ ప్రకారం జులై 1 న రాత్రి 11.50 గంటల నుంచి సేవలు అందుబాటులో ఉండవని.. జులై 2 వ తేదీ అర్థరాత్రి 12.00 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ గడువును ఎందుకు పొడిగిస్తున్నారన్న ప్రశ్నకు.. పోర్టల్ వేగాన్ని పెంచడానికి.. భవిష్యత్తులో క్లెయిమ్ పరిష్కారాలను మరింత వేగవంతం చేయడానికి ఈ గడువును పొడిగిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. జూన్ 26వ తేదీ నుండి, EPFO తన క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ డేటాబేస్‌లను ఏకీకృతం చేయడం, సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడంపై పనిచేస్తోంది. ఈ అప్‌గ్రేడ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయాలను భారీగా తగ్గిస్తుంది. ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, సేవా డెలివరీని మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాదు తరచుగా జరిగే పోర్టల్ క్రాష్‌లను పరిష్కరిస్తుంది. అయితే, ఈ పని జరుగుతున్నప్పుడు, సభ్యులు, యజమానులు మెంబర్ ఇంటర్‌ఫేస్, ఎంప్లాయర్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆన్‌లైన్ సేవలను యాక్సెస్ చేయలేరు. మీరు పీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేయాలన్నా లేదా ఏదైనా అత్యవసర పని కోసం మీ పాస్‌బుక్‌ను తనిఖీ చేసుకోవాలన్నా, జూలై 2న సిస్టమ్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం మంచిది. అయితే, పెళ్లి లేదా వైద్య అత్యవసర పరిస్థితి వంటివి ఉంటే, మీరు మీ సమీపంలోని పీఎఫ్ కార్యాలయానికి వెళ్లి భౌతిక ఫారమ్‌ను సమర్పించవచ్చు. జూన్ 26న EPFO తొలుత కార్యకలాపాలను పునఃప్రారంభించినప్పుడు, ఆన్‌లైన్ సేవలు జూన్ 28 వరకు