
హీరో మాట తూలడం- అతనిపై ట్రోల్స్ సాగడం.. హీరోయిన్స్ గ్లామర్ షో - అందులో వల్గారిటీ ఉందని సోషల్ మీడియాలో దాడి.. ఇలా ఓ కొత్త సినిమా వెలుగు చూసే ముందు ఎన్నెన్నో వివాదాలు. ఇవన్నీ ‘పబ్లిసిటీ స్టంట్స్’ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. హీరో మాట తూలడం- అతనిపై ట్రోల్స్ సాగడం.. హీరోయిన్స్ గ్లామర్ షో - అందులో వల్గారిటీ ఉందని సోషల్ మీడియాలో దాడి.. ఇలా ఓ కొత్త సినిమా వెలుగు చూసే ముందు ఎన్నెన్నో వివాదాలు. ఇవన్నీ ‘పబ్లిసిటీ స్టంట్స్’ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. అందులో కొన్ని వాస్తవాలే ఉన్నా జనాల్లో ఆసక్తి నాస్తి అవుతోంది. ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ అందాల ఆరబోతపై సోషల్ మీడియాలో దుమారం.. సినీజనం ఆడాళ్ళను ఆటబొమ్మలుగా చూస్తున్నారని పలువురు మహిళల ఆవేదన. ఆ వెంటనే డైరెక్టర్ సారీ చెప్పడం- సదరు దృశ్యాలను తొలగిస్తామని చెప్పడం చకచకా జరిగిపోయాయి. కొద్దిరోజులు సినిమాపై, హీరోయిన్, డైరెక్టర్ పై కూడా ట్రోల్స్ సాగాయి. సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్‌ను సపోర్ట్ చేస్తే మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ సందడి కొద్ది రోజులు నడిచింది. అలా ఈ మూవీ గురించి ముచ్చటించుకోవడంతో పబ్లిసిటీ బాగా సాగిందని పరిశీలకుల మాట. ఇదంతా ‘పీఆర్ స్టంట్’ అంటూ యూత్ కొట్టి పారేస్తున్నారు. ఇలాంటివి గతంలోనూ చాలా చూశామనీ అంటున్నారు. వేలాది మంది జనం సమక్షంలో ఎంతో పకడ్బందీగా సాగుతున్న ‘పెద్ది’ ఫంక్షన్ లో అచ్చు హీరో రామ్ చరణ్ లాగే ఉన్న ఓ అభిమాని ఎగిరి గంతేసి హీరోను చేరుకొని హంగామా క్రియేట్ చేశాడు.. తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. అంత సెక్యూరిటీ ఉన్న ఏరియాలో ఓ అనామకుడు ఎలా రాగలడు? అన్నది ప్రశ్న. ఇదీ పబ్లిసిటీ స్టంటే అంటున్నారు. ఈ మధ్యే రిలీజ్ అయిన హిందీ సినిమా ‘మై వాపస్ ఆవూంగా’ సినిమా చూసిన ఓ అభిమాని, డైరెక్టర్ ఇంతియాజ్