పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు
Actor ProfilePolitician

పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు
Andhra Jyothy19 Aug 2026
పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో కనీసం 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 4:00 నుంచి 5:00 గంటల మధ్య నాఫ్తా తరలిస్తున్న పైపులైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు, ఫైర్ సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే రక్షించి హల్దియా సబ్-డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రిఫైనరీ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పైప్‌లైన్‌లో సాంకేతిక లోపమా, లీకేజీ కారణమా లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం సంభవించిందా అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్ డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత