
విజయవాడలో జరిగిన ఓ ఘటనకు కులం రంగు పులిమి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం, హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్‌పై అవమానకరంగా మాట్లాడటం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల మేకప్ గురించి మాట్లాడటానికి గొడ్డలి పార్టీ వారికి సిగ్గు అనిపించడం లేదని, పోలీసులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవన్నీ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టిపల్లెలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వైసీపీ నేతలు అమరావతిపై కుట్ర చేయడానికే అక్కడికి వెళ్లారని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకే రైతులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. "గొడ్డలి పార్టీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉంది. బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు రాబందుల్లా వేచి ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత ఆ పార్టీకి లేదు. దేవాలయాలపై దాడులు చేసిన వాళ్లే ఇప్పుడు గుళ్లకు వెళ్లి నాటకాలు ఆడుతున్నారు. వాళ్లవి పూర్తిగా క్రిమినల్ పాలిటిక్స్. ఇలాంటి వ్యక్తులతో ఆడబిడ్డలకు, సమాజానికి రక్షణ లేదు. వారు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేయడానికి సుదీర్ఘ సమయం పడుతోంది" అని అన్నారు.గత పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పులు, వ్యవస్థల విధ్వంసంతో రాష్ట్రం నలిగిపోయిందని, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూడా తనపైనే ఉందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పునరావాసం కింద రైతులకు రూ.300 కోట్లు అందించామని, త్వరలోనే