తాను ఏరోజు కూడా ఇతర మతాలను అగౌరవపరచలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. జడ శ్రవణ్ కుమార్ తనపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆకివీడు ఘటనలో ఓ వ్యక్తి తలపై మేకు కొడితే తాను ఆ విషయాన్ని ప్రస్తావించానని.. అయితే జడ శ్రవణ్ కుమార్ ఆ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. ఇక అనుమతి లేకుండా ఎవరైనా మైకులను ఉపయోగిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని రఘురామ స్పష్టం చేశారు. జడ శ్రవణ్ కుమార్ చెప్పాడని అనుమతి లేకుండా మైకులు పెట్టుకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో జడ శ్రవణ్ కుమార్ చేసి వ్యాఖ్యలపై విలేకర్ల సమావేశం నిర్వహించిన రఘురామకృష్ణరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత క్రైస్తవుల గురించి మరోసారి మాట్లాడితే తన నాలుక కోసి, పవన్ కళ్యాణ్ కు పంపిస్తానంటూ జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రఘురామ సెటైర్లు వేశారు. నాలుక కోస్తానంటే భయపడిపోవాలా అంటూ ఎద్దేవా చేశారు. శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలు క్రిమినల్ యాక్టివిటీ కిందకు వస్తాయన్న రఘురామకృష్ణరాజు.. నాలుక కోస్తా.. సమాధి కడతానంటూ హత్యకు ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపించారు. తాను హోం మంత్రి కాకపోవడం వలన క్రిమినల్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయిన తర్వాతే జడ శ్రవణ్ కుమార్ మీద ఫిర్యాదు చేస్తానని తెలిపారు.కాకినాడలో జరిగిన మన ఊరు -మాటా మంతీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్.. హోం మంత్రిత్వ శాఖ గురించి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్దఎత్తున చర్చనీయాంశమయ్యాయి. తాను హోం మంత్రిని కాదని.. హోంశాఖ తన పరిధిలో లేదన్న డిప్యూటీ సీఎం.. అది క్రిమినల్స్ చేసుకున్న అదృష్టమంటూ మాట్లాడటం నెట్టింట వైరల్ అయ్యింది. నేరస్థులకు కులాలు, మతాలు అంటగట్టవద్దని.. చట్టప్రకారం నడుచుకోవాలని పవన్ కళ్యాణ్
Actor ProfilePolitician
పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయ్యే వరకూ శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ ఇవ్వను
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Aug 2026
పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయ్యే వరకూ శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ ఇవ్వను