పవన్ కళ్యాణ్ వచ్చినా
Actor ProfilePolitician

పవన్ కళ్యాణ్ వచ్చినా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
పవన్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా మాకు ఏంకాదు - మహేష్ కుమార్
Vaartha20 Jun 2026
పవన్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా మాకు ఏంకాదు - మహేష్ కుమార్

Janasena vs Congress : తెలంగాణ రాజకీయాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. హైదరాబాద్‌లో జనసేన పార్టీ సరికొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి, రాబోయే

పవన్ కళ్యాణ్ వచ్చినా, కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర
Samayam Telugu19 Jun 2026
పవన్ కళ్యాణ్ వచ్చినా, కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర

తెలంగాణలో జనసేన, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సభకు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రారంభమైన ఆగ్రహజ్వాల.. రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్, జనసేనలను తూర్పారా పడుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా జనసేన పార్టీ రాజకీయ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించగా.. కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ .. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎవరితో ఎలాంటి సమస్య ఉందో దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణకు సామరస్యంగా వస్తే తమ ఇంటికి పిలిచి మరీ భోజనాలు పెట్టిస్తానని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్.. రాజకీయాలు చేస్తామంటే మాత్రం నడవనీయమని తేల్చి చెప్పారు.ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో భాగంగా ఉన్న జనసేన.. తెలంగాణలో కూడా పార్టీని పటిష్ఠం చేయాలని నిర్ణయించుకుంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు రానుండగా.. జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఆ దిశగా తెలంగాణలో జనసేన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. జూన్ 2వ తేదీన సభకు అనుమతి లేకపోవడంతో ప్రెస్‌మీట్ పెట్టి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత సందర్భం వచ్చిన

పవన కళ య ణ వచ చ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in