
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Varikapudisela Project Latest News: పల్నాడు జిల్లా ప్రజలకు ఎట్టకేలకు శుభవార్త అందింది. జిల్లాలోని రైతులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైప్‌లైన్ నెట్‌వర్క్ పనులు వేగవంతం చేసేందుకు వీలుగా నేడు కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించి, వారి పొలాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ ఈ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ పనుల కోసం రూ.63.14 కోట్లు నిధులు మంజూరు చేసింది. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.88.00 కోట్లు కాగా, ప్రస్తుతానికి భూసేకరణకు సంబంధించి మొదటి విడతగా రూ.63.14 కోట్లను తక్షణమే కేటాయించింది. ఆ మండలాల రూపురేఖలు మారిపోతాయి! ఈ నిధులతో వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి.. మండలాల్లో భూసేకరణ చేపట్టి, పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా చేయనున్నారు. స్థానిక రైతులతో సమన్వయం చేసుకుంటూ, వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, పైప్‌లైన్ నెట్ వర్క్ పనులను వేగవంతం చేయాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ఎకరాకు నీరందిస్తాం: పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు "రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది" అనే నినాదంతో పనిచేస్తున్న ప్రభుత్వం.. పల్నాడు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు విశ్రమించదని, వరికపుడిసెల ప్రాజెక్టును అత్యంత