పరిహారం ఇవ్వకుండా భూసేకరణ.. అవసరమైతే జగన్ ను పిలుస్తాం.. పెనుమాక రైతులు
Actor ProfilePolitician

పరిహారం ఇవ్వకుండా భూసేకరణ.. అవసరమైతే జగన్ ను పిలుస్తాం.. పెనుమాక రైతులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పరిహారం ఇవ్వకుండా భూసేకరణ.. అవసరమైతే జగన్ ను పిలుస్తాం.. పెనుమాక రైతులు
Samayam Telugu8 Aug 2026
పరిహారం ఇవ్వకుండా భూసేకరణ.. అవసరమైతే జగన్ ను పిలుస్తాం.. పెనుమాక రైతులు

అమరావతిలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతలకు కారణమైన సంగతి తెలిసిందే. పెనుమాకలోని రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను అమరావతి రైతులు అడ్డుకోవటం శనివారం ఉద్రిక్తతలు దారితీసింది. దీంతో రాళ్లదాడులు. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. అయితే అమరావతి రాజధాని కోసం పరిహారం చెల్లించకుండా తమ భూములను సేకరిస్తున్నారని పెనుమాక రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన పెనుమాక రైతులు.. నిర్దిష్టమైన పద్ధతిలో అధికారులు వ్యవహరించడం లేదని.. దీనిపై తాము కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. తమ సమస్యలపై కలెక్టర్ వద్దకు వెళ్తే స్పందించడం లేదని. సీఆర్డీఏ కూడా ఏమీ తెలియదంటోందని తెలిపారు. అయితే ఇవేవీ పట్టనట్లుగా కలెక్టర్ భూసేకరణ కోసం నోటీసులు ఇవ్వటంపై ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. మరోవైపు రాజధాని కోసం తమ భూములు లాక్కునేందుకు ఓ వైపు భూసమీకరణ, మరోవైపు భూ సేకరణ అమలు చేస్తున్నారని పెనుమాక రైతులు వాపోతున్నారు. పొలాల్లో గుంటలు తవ్వుతూ, రోడ్లు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన స్పందించి రైతు పరిరక్షణ కమిటీని వేశారన్నారు. తమ బాధలు వినేందుకు, తమ భూములు పరిశీలించేందుకు రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు వస్తే.. వారిని అడ్డుకోవటం దారుణమని పెనుమాక రైతులు మండిపడుతున్నారు. తమ భూములను పరిశీలించేందుకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఆహ్వానిస్తామని.. అవసరమైతే జగన్‌ను కూడా తమ గ్రామానికి పిలుస్తామని పెనుమాక రైతులు స్పష్టం చేశారు.మరోవైపు అమరావతిలో శనివారం జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. తాడేపల్లి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. పెనుమాకకు చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అమరావతిలో హైటెన్షన్.. వేడి పెంచిన వైసీపీ నేతల పర్యటనపోలీస్ అధికారిని నెట్టారనే కారణంతో అంబటి

పర హ ర ఇవ వక డ భ స కరణ అవసరమ త జగన న ప ల స త ప న మ క ర త ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in