పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. స్టీల్ ప్లాంట్ విషాదం మరువక ముందే
Actor ProfilePolitician

పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. స్టీల్ ప్లాంట్ విషాదం మరువక ముందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. స్టీల్ ప్లాంట్ విషాదం మరువక ముందే
Oneindia Telugu5 Jul 2026
పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. స్టీల్ ప్లాంట్ విషాదం మరువక ముందే

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. దాంతో ఆ సమయంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోగా.. ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారని సమాచారం. మరో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, పరిశ్రమల శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో ఫార్మాసిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సీఎం చంద్రబాబు ఆరా..ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన ఇద్దరు కార్మికుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. అలానే హోం మంత్రి అనిత సైతం ఈ విషాద ఘటనపై స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.మరోవైపు ఈ అగ్నిప్రమాదంపై మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ

పరవ డ ఫ ర మ స ట ల ఘ ర ప రమ ద స ట ల ప ల ట వ ష ద మర వక మ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in