పని మనుషులను ఇంట్లో బంధించిన నటుడు రవి మోహన్
Actor ProfileActor

పని మనుషులను ఇంట్లో బంధించిన నటుడు రవి మోహన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పని మనుషులను ఇంట్లో బంధించిన నటుడు రవి మోహన్
Eenadu11 Jul 2026
పని మనుషులను ఇంట్లో బంధించిన నటుడు రవి మోహన్

చెన్నై (ప్యారిస్‌): చోరీకి పాల్పడ్డారని తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని ప్రముఖ తమిళ నటుడు రవిమోహన్‌ బంధించినట్లు సమాచారం. చెన్నై నీలాంగరైలో నటుడు రవి మోహన్‌ నివాసం ఉంది. ఇంట్లో నగలు, నగదు చోరీ అయ్యాయని అక్కడ పనిచేస్తున్న ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని రవి మోహన్‌ బంధించినట్లు తెలుస్తోంది. పని మనిషి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త అక్కడకు వెళ్లగా ఆమెను బంధించినట్లు తెలుసుకున్నాడు. భార్యను ఇంటికి పంపాలని కోరగా.. రవి మోహన్‌ నిరాకరించారు. దీంతో ఆమె భర్త నీలాంగరై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నటుడి ఇంటికి వెళ్లి మహిళలను బంధించడం సరికాదని హితవు పలికి వారిని విడిపించారు. అదేవిధంగా చోరీ విషయమై ఫిర్యాదు చేయాలని రవి మోహన్‌కి సూచించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు