పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే
Actor ProfilePolitician

పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే

Total News1
Movie Updates0
Sources1
పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే
Oneindia Telugu16 Jun 2026
పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే

ఆదాయపు పన్ను (Income Tax) రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు చాలామంది పన్ను చెల్లింపుదారులు కేవలం డిడక్షన్స్ (మినహాయింపులు), రిబేట్లపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని రకాల ఆదాయాలపై అసలు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. వీటిని ఎగ్జెంప్ట్ ఇన్‌కమ్ (Exempt Income) అంటారు. అసలు పన్ను పరిధిలోకి రాని ఈ ఆదాయాల గురించి సరైన అవగాహన లేకపోతే.. ట్యాక్స్ ప్లానింగ్‌లో మంచి అవకాశాలను కోల్పోవడమే కాకుండా, ఐటీఆర్ (ITR) ఫైలింగ్‌లో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది.ముఖ్యంగా అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27 ఐటీఆర్ ఫైలింగ్ విధానంలో ఈ పన్ను రహిత ఆదాయాల వివరాలను వెల్లడించడం మరింత కీలకమయింది. పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయినా.. ఐటీఆర్ పోర్టల్‌లో నిర్దేశించిన కాలమ్స్ లేదా షెడ్యూల్స్‌లో ఈ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి భారత పన్ను చట్టాల ప్రకారం ట్యాక్స్ పరిధిలోకి రాని ఆ 10 రకాల ఆదాయాల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..1. వ్యవసాయ ఆదాయం (Agricultural Income)భారతదేశంలో ఉన్న వ్యవసాయ భూమి ద్వారా సంపాదించే ఆదాయానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(1) కింద పూర్తి పన్ను మినహాయింపు ఉంది. పంటల సాగు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం, లేదా వ్యవసాయ భూమి ద్వారా వచ్చే అద్దె/కౌలు వంటివన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.2. అవిభక్త హిందూ కుటుంబం (HUF) నుంచి వచ్చే మొత్తంఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(2) ప్రకారం ఒక హిందూ అవిభక్త కుటుంబం (HUF) పొందే ఆదాయం నుంచి ఆ కుటుంబ సభ్యుడికి లభించే డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు. ఎందుకంటే HUF అనేది ఒక ప్రత్యేక పన్ను పరిధిగా పరిగణించబడి, ఇప్పటికే పన్ను చెల్లించి ఉంటుంది కాబట్టి, ఆ మొత్తాన్ని సభ్యుల చేతుల్లో మళ్లీ పన్ను వేయరు.3. పార్టనర్‌షిప్ సంస్థలు లేదా LLPల లాభాల వాటాఒక పార్టనర్‌షిప్