
సీనియర్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, ఫిలాంథ్రపిస్ట్ , బిల్డర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి మురళీమోహన్ కి పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ అరుదైన గౌరవంపై తన అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో మురళీమోహన్‌కు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల చాలామంది ఇది ఆలస్యంగా వచ్చిన గౌరవం అని అన్నారు. అయితే, ఆయన ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. “నేను అట్లా అనుకోవట్లేదు. 140 కోట్ల మంది జనాభాలో నేను ఒక నలుసుని. అలాంటి నలుసుని వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారంటే అది గొప్ప విషయం. అందుకని నేను లేట్ గా వచ్చింది అనుకోవట్లేదు, లేటెస్ట్ గా వచ్చింది అనుకుంటున్నాను” అని ఆయన తెలిపారు. పద్మశ్రీ అవార్డు కోసం మురళీమోహన్ చేసిన ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మొదటిసారి దరఖాస్తు చేసినప్పుడు, ఎంపీలకు పద్మ అవార్డులు ఇవ్వరని చెప్పడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. “అప్పుడు మీరు పొలిటీషియన్ గా ఉన్నారు కాబట్టి నాట్ ఎలిజిబుల్ అన్నారు” అని గుర్తు చేసుకున్నారు. తర్వాత ఒకసారి మళ్ళీ దరఖాస్తు చేసినప్పుడు, పోలీస్ విచారణ, కేవైసీ నివేదికలు వంటి ప్రక్రియలు అన్నీ పూర్తయ్యాయి. పోలీసుల నుండి ఆయనకు క్లీన్‌చిట్ వచ్చిందని, అవార్డు ఖచ్చితంగా వస్తుందని అభినందనలు కూడా అందాయి. కానీ అవార్డు రాలేదు. ఆ తర్వాత ఆయన నిరాశ చెంది, ఇక దరఖాస్తు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక మూడోసారి స్నేహితుల ప్రోత్సాహంతో చివరి ప్రయత్నంగా దరఖాస్తు చేశారు. ఈసారి కూడా రాకపోతే అసలు ప్రయత్నించకూడదని అనుకున్నాని తెలిపారు. ఈసారి అనుకోని విధంగా శుభవార్త అందింది. ఒకరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా, ఆయనకు ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ వచ్చింది. కాల్ ఎత్తకుండా జేబులో పెట్టేసుకున్న ఆయన, మళ్ళీ కాల్ రావడంతో ఎవరో అని మాట్లాడారు. అవతల ఉన్నవారు ఢిల్లీ హోమ్