పత్రాలే అంతిమం కాదు
Actor ProfileCelebrity

పత్రాలే అంతిమం కాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పత్రాలే అంతిమం కాదు
Sakshi21 Jun 2026
పత్రాలే అంతిమం కాదు

ఆ పత్రాలు లేకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలూ రుజువుగా ఇవ్వొచ్చు రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు కాగా, అందులో 37% ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు వీరందరికీ నోటీసులిచ్చి విచారణకు పిలవనున్న ఈఆర్వోలు మేడ్చల్, రంగారెడ్డి,హైదరాబాద్‌ జిల్లాల్లో 43, 46, 58 శాతమే ఓటర్ల మ్యాపింగ్‌ జూలై 25లోగా ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించిన ఓటర్లకే ముసాయిదా జాబితాలో చోటు సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌), 2026లో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకోనున్న వ్యక్తులు సమర్పించాల్సిన రుజువులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల జాబితానే పరిమితం కాదు..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలను సైతం రుజువుగా సమర్పించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సర్‌ కార్యక్రమానికి ముందస్తు సన్నద్ధతలో భాగంగా 2002, 2026 ఓటర్ల జాబితాలను అనుసంధానం (మ్యాపింగ్‌) చేయగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 89,88,175 మంది ఓటర్ల వివరాల్లో తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ‘సర్‌’షెడ్యూల్‌ ప్రకారం వ్యత్యాసాలు కలిగిన ఓటర్లందరికీ జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 28 మధ్య స్థానిక ఎలక్టరోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారన్నారు. సర్‌ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో సుదర్శన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏఏ ధ్రువీకరణ పత్రాలను రుజువుగా స్వీకరిస్తారని విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్వోలకు విచక్షణాధికారాలను కల్పించినట్టు వెల్లడించారు. 5 లక్షల డూప్లికేట్‌ ఓటర్ల తొలగింపు రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డూప్లికేట్‌ ఓట్లను గుర్తించి తొలగించినట్టు సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒకే పేరు, ఇతర వివరాలతో వేర్వేరు చోట్లలో ఓటర్లు కలిగి ఉన్నట్టు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఈ ఓటర్లను గుర్తించామన్నారు. గడువు పొడిగింపు ఉండదు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24

పత ర ల అ త మ క ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in