పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు
Actor ProfileActor

పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు
Sakshi1 Aug 2026
పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు

పగలంతా ఆస్పత్రిలో తెల్ల కోటు వేసుకుని రోగులకు సేవలు.. రాత్రి ఇంటికొచ్చాక మాత్రం మనిషి ఊహించలేని భయానక ప్రపంచం!. మానవ అవయవాలను సేకరించడం.. ఇంట్లో దాచుకోవడం.. వాటితో వింత ప్రయోగాలు చేయడం.. చివరకు వాటిలో కొన్నింటిని తానే తిన్నానని పోలీసుల ఎదుట ఒప్పుకోవడం!. ఇదెదో డబ్బింగ్‌ సినిమా కథ అనుకునేరు!. ఒక ఆస్పత్రి ఉద్యోగి గురించి బయటపడిన ఈ నిజాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. అతడి ఇంట్లో కనిపించిన దృశ్యాలు హారర్‌ సినిమాలను తలపించగా.. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆస్పత్రిలో పేషెంట్‌ ట్రాన్స్‌పోర్టర్‌ (రోగులను తరలించే ఉద్యోగి)గా పని చేసే ఉద్యోగి(30) చీకటి కోణం షాక్‌కు గురి చేస్తోంది. మానవ అవశేషాలను అక్రమంగా సేకరించడం, వాటిని తన ఇంట్లో నిల్వ చేయడం, చివరకు.. వాటిని వండుకోకుండా పచ్చిగా తీసేశాడన్న అనుమానాలతో పోలీసులు సోదాలు జరిపారు. తనిఖీల్లో దాదాపుగా అవే నిజాలని తెలిసి నిర్ఘాంత పోయారు. చివరకు.. అరెస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో వెలుగుచూసింది. సోదాల్లో అతడి ఇంట్లో కనిపించిన దృశ్యాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేశాయి. మనిషి తల, ముఖం మీది చర్మం, కాలు భాగం, మెదడు, చేయి, పలు పుర్రెలు, ఎముకలు, సూట్‌కేసులో దాచిన అస్థిపంజర భాగాలు.. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక జాడీలో భద్రపరిచిన గుండె పోలీసులకు మాట పడిపోయేలా చేసింది.( ఆ గుండె మనిషిదేనా? లేక జంతువుదా? అనేది ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలాల్సి ఉంది)!. జూన్‌ 17వ తేదీన అతన్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేయగా.. 23న ఆ విషయం బయటకు వచ్చింది. విచారణలో నిందితుడు.. మానవ శరీర భాగాలపై తనకు అమితమైన ఆసక్తి ఉందని.. అందుకే కొన్నింటిని శరీరాల నుంచి తానే వేరుచేసి తిన్నానని అంగీకరించాడు. శరీర నిర్మాణ శాస్త్రం (అనాటమీ), పాథాలజీపై అతడికి విపరీతమైన ఆసక్తి ఉండేదని, జంతువులను కోసి పరిశీలించడం కూడా అతడి

పగల నర స ర త ర త నరమ స భక షక డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in