
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Folk Song: బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే.. చేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే..!! ఈ పోరడి నిలువెత్తు ప్రాణాలే నాలో ఉన్నాయే.. శ్రావణ మాసపు బలాలే సై అన్నాయే..!! బాసింగ బాసింగ బంగారు బొమ్మలే.. చూసినోళ్ల కళ్లల్లో నీ వెంట పరుగులే.. ఈ జన్మలోనా జీవితమే పండుగలే..!! అటో డజాను.. ఇటో డజాను.. గాజులు వేపిస్తా పిల్ల.. నీ నుదిటిన బాసింగం కట్టి.. నా ఇంటికి తీసుకెళ్తా పిల్ల..!! పెళ్లి పందిట్లోన పెండ్లి కొడుకై నేను కూర్చుంటే.. నా పక్కన చేరి సిగ్గుల మొగ్గవు నువ్వవుతుంటే.. ఈడు జోడు కలిసిన వేళా.. మన బంధం గట్టిపడతా ఉంటే.. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేస్తుంటే..!! బాసింగ బాసింగ బలాలే భలేగున్నాయే.. చేతుల జిలకర బెల్లాలే కలిసున్నాయే..!! తెలంగాణ అంటేనే ఫోక్ సాంగ్స్.. ఫోక్ సాంగ్స్ అంటేనే తెలంగాణ. ఎప్పటికప్పుడు సరికొత్తగా వచ్చే తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ షేక్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే వందలాది పాటలు ఓ రేంజ్ లో దుమ్ముదురేపాయి. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ పెళ్లి పాట మాత్రం కొన్నేండ్ల వరకు యాదికుంటుంది. ఈ పాట విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్ ను షేక్ చేసిందంటే.. ఈ పాటకున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఈ పాట చూస్తున్నంత సేపు నిజంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లి కబర్లు చెబుతున్నట్లుగానే అనిపిస్తుంది. తెలంగాణ బీట్ తో ఈ పాట మొదలవుతుంది. ఆ బీట్ లో ఎంగేజ్ మెంట్, తర్వాత పెళ్లికి సంబంధించి ఒక్కో ఘట్టాన్ని ఎంతో అద్బుతంగా చూపించారు. అటో డజను.. ఇటో డజను