నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను
Actor ProfilePolitician

నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను
Andhra Jyothy2 Sept 2026
నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను

తన యువగళం పాదయాత్రలో వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను లోకేశ్ ఆశీర్వదించారు. అమరావతి, జులై 2 (ఆంధ్రజ్యోతి): తన యువగళం పాదయాత్రలో వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను లోకేశ్ ఆశీర్వదించారు. కార్యక్రమంలో యువగళం బృంద సభ్యులను ఆప్యాయంగా పలకరించిన ఆయన, పాదయాత్ర రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు కార్యకర్తలతో లోకేశ్ ముచ్చటించారు. యువగళం విజయవంతం కావడంలో టీడీపీ కేడర్ పాత్ర కీలకమని ప్రశంసించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎదురైన అణచివేతలు, ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కార్యకర్తే అధినేత’ అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కేడర్ సాధికారతకు నిరంతరం కృషి చేస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామకాలు వంటి అంశాల్లో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా యువగళం ద్వారా ఏర్పడిన బంధం శాశ్వతమని, కార్యకర్తలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు