
Business Ideas: మీరు స్వంత వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలన్న మీ కలను సాకారం చేసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ అందించే వ్యాపారాల గురించి తెలుసుకుందాం. Business Ideas: రోజూ ఆఫీస్ లో బాస్ టార్చర్, వర్క్ ప్రెజర్ తో విసిగిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. అది చిన్న ఉద్యోగం, కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు.. ఒత్తిడి మాత్రం తప్పదు. ఎక్కువగా సాఫ్ట్ వేర్ రంగాల ఉద్యోగులే ఒత్తిడికి లోనవుతారని అనుకుంటారు. కానీ సాఫ్ట్ వేర్లే కాదు.. అందులో పనిచేసే ఆఫీస్ బాయ్ లకు కూడా టార్చర్లు తప్పవు. అందుకే చాలా మంది యువత ఇప్పుడు ఉద్యోగాలకు స్వస్తి పలికి సొంతంగా వ్యాపారం పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే బాస్ టార్చర్ ఉండదు.. ఎలాంటి ఒత్తిడి ఉండదు. కానీ బిజినెస్ లో రాణించాలంటే సొంత తెలివితేటలతో పాటు ఆకట్టుకునే గుణం ఉండాలి. మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కేవలం రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షల లోపు పెట్టుబడితో మంచి లాభాలను అందించే టాప్ బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. 9 గంటల నుంచి 5గంటల ఉద్యోగాల గులాంగిరీకి గుడ్ బై చెప్పి సొంతంగా ఓనర్ అయి అద్రుష్టాన్ని మార్చుకోవాలనుకునే మిడిల్ క్లాస్ వారికి ఈ బిజినెస్ ఐడియాలు చక్కటి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పాలి. కేఫ్‌లు: చాలా మంది యువత కేఫ్ లకు వెళ్లేది స్నాక్స్, టీ తాగేందుకే కాకుండా అక్కడి ప్రశాంతమైన వాతావరణం కోసం వెళ్తుంటారు. అందుకే యువతలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది. మీరు ఈ బిజినెస్ ను రూ. 10లక్షలతో అద్భుతమైన ఇంటీరియర్, బెస్ట్ సర్వీస్ తో ప్రారంభించవచ్చు. ఎందుకంటే కేఫ్ కు వచ్చేవారికి ఇంటీరియర్, టేస్టీ ఫుడ్, సర్వీస్ నచ్చినట్లయితే.. మళ్లీ మళ్లీ వస్తుంటారు. పాథాలజీ ల్యాబ్: ఆరోగ్యం సంరక్షణ సేవల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా