నిలకడైన రొయ్యల సాగు.. కొన్ని మార్గదర్శకాలు
Actor ProfilePolitician

నిలకడైన రొయ్యల సాగు.. కొన్ని మార్గదర్శకాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిలకడైన రొయ్యల సాగు.. కొన్ని మార్గదర్శకాలు
Sakshi24 Jul 2026
నిలకడైన రొయ్యల సాగు.. కొన్ని మార్గదర్శకాలు

రొయ్యల సాగు రంగం ప్రస్తుతం అధిక ఉత్పత్తి వ్యయం, వ్యాధులు, నాణ్యత లేని సీడ్, మేత ధరలు, విద్యుత్‌ ఛార్జీల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటువంటి సంక్షోభ సమయంలో పంట విరామం (క్రాప్‌ హాలిడే) ప్రకటించడం శాశ్వత పరిష్కారం కాదు. దీనివల్ల మౌలిక సదుపాయాల నష్టం, కార్మికుల కొరత, మార్కెట్‌ నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, శాస్త్రీయ నిర్వహణతో సాగు విధానాన్ని మార్చడమే నిజమైన పరిష్కారం. ఉత్పత్తి కాదు లాభమే లక్ష్యం అధిక స్టాకింగ్‌ సాంద్రత వ్యాధులు, ఒత్తిడి, మరణాల రేటును పెంచుతుంది. 90% సర్వైవల్‌తో మధ్యస్థ దిగుబడి సాధించిన రైతు, 65% సర్వైవల్‌తో అధిక దిగుబడి సాధించిన రైతు కంటే ఎక్కువ లాభం పొందగలడు. కాబట్టి ‘తక్కువ సాంద్రత – ఎక్కువ సర్వైవల్‌’ విధానమే ఉత్తమం. నాణ్యమైన సీడ్‌ – నీటి నిర్వహణ నాణ్యత లేని చౌక సీడ్‌ చివరికి భారీ నష్టాలకు కారణమవుతుంది. విశ్వసనీయ హేచరీల నుంచి జన్యుపరంగా నాణ్యమైన సీడ్‌ను ఎంపిక చేయాలి. అలాగే వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే, మూడు దశల నీటి రిజర్వాయర్‌ వ్యవస్థ ద్వారా ముందస్తు నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు నచ్చిన లాబ్‌లలో నాణ్యతా పరీక్షలు చేయించుకొని సీడ్‌ చెక్‌ చేసుకోవాలి. ఖర్చుల నియంత్రణ మేత సాగులో అత్యధిక వ్యయం. ఫీడ్‌ ట్రేల ద్వారా మేత వినియోగాన్ని నిరంతరం పరిశీలించి, సరైన ఫీడ్‌ కన్వర్షన్‌ రేషియో సాధించాలి. అధిక సామర్థ్యం గల ఎయిరేటర్ల వినియోగం, శాస్త్రీయ ఎయిరేటర్ల ప్రణాళిక ద్వారా విద్యుత్‌ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు. అవకాశమున్నచోట్ల సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సాగు ప్రాంతాల ప్రత్యేకతలు సముద్రపు ఉప్పు నీటితో సాగు చేసే ప్రాంతాల్లో సర్వైవల్‌ రేట్, షెల్‌ బలంగా ఉండి, ఖనిజాల ఖర్చు తక్కువగా ఉంటుంది. బోర్‌ నీరు లేదా మంచినీటి ప్రాంతాల్లో ఖనిజాల లోపం, అధిక ఎయిరేషన్‌ అవసరం వల్ల ఉత్పత్తి వ్యయం సుమారు 10–15%

న లకడ న ర య యల స గ క న న మ ర గదర శక ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in