
హైదరాబాద్: ఎస్‌ఐర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులను క్షమించే ప్రసక్తి లేదని, పనిచేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పని చేయని వారికి 10 రోజుల సమయం ఇచ్చి చూస్తాం.. లేకుంటే వారి స్థానంలో మరొకరిని నియమిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌పై సర్పంచ్‌లతో గ్రామాల్లో ప్రచారం చేయించాలని సూచించారు. తెలంగాణలో రేపటి నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) ప్రారంభం కానుండడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, బూత్ స్థాయి నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ఓటర్ల హక్కులను కాపాడటంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, దేశవ్యాప్తంగా భాజపా రాజకీయ వ్యూహాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల నిర్వహణ విషయంలో జరిగిన పరిణామాలను పీసీసీ అధ్యక్షుడు ప్రస్తావించారు. తమకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాద ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరిగే ప్రమాదం ఉందని, ప్రతి అర్హత కలిగిన ఓటు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత కీలకంగా పని చేయాలని సూచించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు