
Telugu Times•20 Jun 2026
నారా భువనేశ్వరి బర్త్ డే సందర్భంగా ... నిరంజన్ కుటుంబానికిహనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ (Niranjan)కు సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బర్త్‌డే సందర్భంగా బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఇటీవల నిరంజన్‌ను పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పరామర్శించిన విషయం తెలుసుకున్న తర్వాత, తనవంతు ఆర్థిక సాయం అందజేస్తున్నాని బండ్ల గణేష్ తెలిపారు. నిరంజన్ త్వరగా కోలుకొని తన కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో కూడా తనవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు