నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్
Actor ProfilePolitician

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్
Oneindia Telugu22 Aug 2026
నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 6557పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎంతోమంది యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అటువంటి వారి కోసం రైల్వే శుభవార్త తెచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న యువకులకు రైల్వే శాఖ నుంచి బంపర్ అవకాశం వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ మరియు గ్రేడ్-3 విభాగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం వివిధ ట్రేడ్లలో నియామకాలు జరుగనున్నాయి. ట్రాక్ మెషిన్, బ్రిడ్జ్, డీజిల్ ఎలక్ట్రికల్/మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ తదితర డిపార్ట్‌మెంట్లలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18-33 ఏళ్లు, గ్రేడ్-3కి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు జూన్ 30, 2026 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు చదివి అప్లై చేసుకోవాలి. ఇది రైల్వేలో ఉద్యోగం కోరుకునే వారికి గొప్ప అవకాశం గా చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం జూలై 29 లోపు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకుని, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపొండి