నైరుతి ఋతుపవనాలు.. ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Actor ProfileCelebrity

నైరుతి ఋతుపవనాలు.. ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

Total News1
Movie Updates0
Sources1
నైరుతి ఋతుపవనాలు.. ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Zee Telugu17 Jun 2026
నైరుతి ఋతుపవనాలు.. ద్రోణి ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Rain Effect: ఆంధ్ర ప్రదేశ్‌లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించినందున రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో వర్షాలన్న వాతావరణశాఖ.. దీని ప్రభావంతో వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందంటోంది. ఈ రోజు విజయనగరం, పోలవరం, ఏలూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి , ఎన్టీఆర్‌. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎండ ప్రభావం గతంలో కంటే తగ్గింది. వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద ఉండవద్దని IMD సూచన.. ఏపీలో నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో 14 జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాదు ఉరుములు, మెరుపులు కూడిన వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా చెట్ల కింద ఉండవద్దని ఐఎండి తెలిపింది. మరోవైపు విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని చెప్పింది. పలు చోట్ల 20 నుంచి 30 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలందరూ అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. అంతేకాదు కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలపై టార్పాలిన్ వంటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. లేకపోతే ధాన్యపు రాశులను గోడౌన్స్‌కు తరలించాలని వ్యవసాయ శాఖ అధికారులు