
నిమ్స్‌లో ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల కింద చికిత్సలను అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. పలువురు రోగులు నగదు రహిత సేవలను కోరుతున్నారు .. అందుకు అవకాశాలను పరిశీలిస్తున్నాం నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ హైదరాబాద్ సిటీ/నిమ్స్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో ప్రైవేటు ఆరోగ్య బీమా పథకాల కింద చికిత్సలను అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. చాలా మంది రోగులు నగదు రహిత చికిత్సల్లో భాగంగా ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్‌ను నిమ్స్‌లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే దానిపై దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఇన్సూరెన్స్ కింద చికిత్సలను అందించే విధానం లేదు. నిమ్స్ డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాహుల్ దేవరాజ్.. ఆసుపత్రిలో చేపట్టాల్సిన పనులు, తమ ప్రాధాన్యాల గురించి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరించారు. సిటీస్కాన్, ఎంఆర్‌ఐ, అలా్ట్రసౌండ్ వంటి పరీక్షల రిపోర్టులు ఇవ్వటానికి ప్రస్తుతం ఏడు రోజుల వరకు సమయం పడుతుందని.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని.. 48 గంటల్లో పరీక్షలు పూర్తి చేసి, మెడికల్ రిపోర్టులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రివ్యూ కౌంటర్‌ను ఏర్పాటు చేసి డాక్టర్లు సాయంత్రం వరకు అక్కడే ఉండే విధంగా చూస్తున్నామని, దీనివల్ల మెడికల్ రిపోర్టు వచ్చిన రోజునే రోగులు డాక్టర్‌ను సంప్రదించే అవకాశం ఉంటుందని తెలిపారు. మాస్టర్ హెల్త్ చెకప్ వంటి పరీక్షలను కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. ఎమర్జెన్సీ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని డాక్టర్ రాహుల్ దేవరాజ్ వివరించారు. కొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా ఉంటున్నాయని, కోలుకొని 2-3 రోజుల్లో డిశ్చార్జి అయ్యే రోగులను ఆ విభాగాలకు తరలిస్తున్నామని, దీని వల్ల రోగుల రద్దీ ఎక్కవగా ఉండే కీలక విభాగాలపై భారం తగ్గుతుందన్నారు. ఔట్‌పేషంట్