
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిఫా ప్రపంచకప్ క్రేజ్ నడుస్తోంది. అభిమానులంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. అయితే గోల్స్‌తోనే ఫుట్‌బాల్ ఆటలో కిక్ ఉంటుంది. 90 నిమిషాల పాటు సాగే ఆటలో ఎవరెన్ని గోల్స్ చేశారు.. ఏ ఆటగాడు ఎన్ని గోల్స్ కొట్టాడు.. ఇలా అభిమానులు కౌంట్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్క గోల్‌తోనే మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలున్నాయి. అసలు గోల్ నమోదు కాకుండా డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు కోకొల్లలు. ఇక 1930లో ఫిఫా ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2,700 గోల్స్ చేయడం విశేషం. అయితే ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ నమోదు అయిన మ్యాచ్‌లు అరుదుగా ఉంటాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 12 గోల్స్ నమోదు కావడం ఇప్పటికీ రికార్డుగా ఉంది. 1954లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. అంతేకాదు ఫిఫా చరిత్రలో 71 ఏళ్లుగా ఈ రికార్డు ఇప్పటికీ చెక్కెచెదరలేదు. మూడు సందర్భాల్లో ఈ రికార్డుకు చేరువలోకి వచ్చినప్పటికీ 12 గోల్స్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. 1954 ఫిఫా ప్రపంచకప్: ఆస్ట్రియా వర్సెస్ స్విట్జర్లాండ్ 👉ఈ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లు తలపడ్డాయి. జూన్ 26న జరిగిన మ్యాచ్‌లో మొదటి 23 నిమిషాల్లో స్విట్జర్లాండ్ మూడు గోల్స్ కొట్టగా, తర్వాతి 25 నిమిషాల్లో ఆస్ట్రియా 5 గోల్స్ కొట్టడం విశేషం. మొదటి హాఫ్ ముగిసేసరికే ఇరుజట్లు కలిపి 9 గోల్స్ కొట్టడం విశేషం. ఆ తర్వాతి హాఫ్ టైమ్‌లో మరో మూడుగోల్స్ నమోదయ్యాయి. ఇందులో ఆస్ట్రియా రెండు, స్విట్జర్లాండ్ ఒకటి ఉన్నాయి. అంతిమంగా 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఆస్ట్రియా 7-5తో స్విట్జర్లాండ్‌పై విజయాన్ని అందుకుంది. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ నమోదయిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. అంతేకాదు ఈ రికార్డు ఏడు దశాబ్దాలుగా చెక్కుచెదరలేదు. 1982 ఫిఫా ప్రపంచకప్: హంగేరి వర్సెస్