నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
Actor ProfilePolitician

నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
అతను చెప్పినట్లు నేను వినను..' ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నెతన్యాహు
Andhra Jyothy2 Jul 2026
అతను చెప్పినట్లు నేను వినను..' ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నెతన్యాహు

ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. తామిద్దరం ఒకరి ఆదేశాలను మరొకరు పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు

ఫేక్ ప్రచారాల విషయంలో జాగ్రత్త.. అధికారులతో సీఎం చంద్రబాబు
Andhra Jyothy30 Jun 2026
ఫేక్ ప్రచారాల విషయంలో జాగ్రత్త.. అధికారులతో సీఎం చంద్రబాబు

పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. అమరావతి, జూన్ 22

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Andhra Jyothy30 Jun 2026
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే

ఏపీ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని బదిలీ చేస్తూ ఆదేశాలు
Andhra Jyothy29 Jun 2026
ఏపీ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని బదిలీ చేస్తూ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బదిలీకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యువజన, అభ్యుదయ, పర్యాటక & సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖకు అకాడమీని

నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
Andhra Jyothy29 Jun 2026
నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌ వెళ్లిన రాధాగాయత్రి అక్కడి హోమ్‌స్టేలో మృతిచెందిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, జూన్ 22: విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌ వెళ్లిన రాధాగాయత్రి అక్కడి హోమ్‌స్టేలో మృతిచెందిన విషయం తెలిసిందే. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు అయినప్పటికీ.. గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్‌పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తాజాగా రాధాగాయత్రికి చెందిన చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నా మీద అనుమానం, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేనేదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో అన్నాను. నేను ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోవడం లేదు. ఏదైనా ఉంటే మా అమ్మవాళ్లతో మాట్లాడమని చెప్పా. ఇన్నాళ్లూ ఓపిక పట్టాను. నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు’ అని ఫోన్‌లో రాధాగాయత్రి చెబుతున్నట్లు ఆడియోలో ఉంది. తల్లితో గాయత్రి ఫోన్‌ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్‌ను కలిసిన టెకీ గాయత్రి తల్లి