నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన
Actor ProfilePolitician

నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన

Total News1
Movie Updates0
Sources1
నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన
Sakshi13 Jun 2026
నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన

బాలీవుడ్ భామ మౌనీ రాయ్ బాలీవుడ్‌లో సుపరిచమైన పేరు. ఇటీవలే ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కానీ ఆ తర్వాత మౌనీ రాయ్‌పై పెద్దఎత్తన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. చాలా దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. ఆమెను గే అంటూ రూమర్స్ సృష్టించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మౌనీ రాయ్ తనపై వచ్చిన రూమర్స్‌, ట్రోల్స్‌పై స్పందించింది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. తనపై గే అన్న రూమర్‌పై రియాక్ట్ అయింది. తాను విన్న వాటిలో అత్యంత అసంబద్ధమైన రూమర్‌ ఇదేనని మౌనీ రాయ్‌ వెల్లడించింది. విడాకుల ప్రకటన తర్వాత తన చుట్టూ బలమైన మద్దతుగా నిలబడే వాళ్లు ఉండడం తన అదృష్టమని మౌనీ రాయ్ చెప్పింది. నాకు ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలిచే స్నేహితులు, కుటుంబం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో నా స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషించారని మౌని చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్స్ మంచి, చెడు సందర్భాల్లోనూ నాకు తోడుగా నిలిచారని మౌనీ రాయ్ పంచుకున్నారు. కాగా.. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2022లో సూరజ్‌ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే 2026లో అతనితో విడిపోయారు. మౌని, సూరజ్ ఇద్దరూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) చిత్రంలో కనిపించారు. ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) 'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్‌ (ఫొటోలు) సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు) 'కాక్‌టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు) ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 : అంద‌రి క‌ళ్లు వీరిపైనే..(ఫొటోలు) 15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికే.. సంచలన ఆడియోతో బయటపడ్డ లోకేష్ బండారం