
భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి పాక్ వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా నియంత్రణ


భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి పాక్ వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా నియంత్రణ

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన 'రెక్కలు విరగ్గొట్టారు' అనే వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కౌంటర్ ఇచ్చారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన 'రెక్కలు విరగ్గొట్టారు' అనే వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ముంబై నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లిన విమానంలో ఈ ఇద్దరు నాయకులు కలిసి ప్రయాణించారు. ఆ ప్రయాణం గురించి ఠాక్రే స్పందిస్తూ.. 'ప్రధానమంత్రి రేసులో ఫడణవీస్ కూడా ఉన్నారు. అందుకే ఆయన రెక్కలు కత్తిరించారు. విమానంలో ఆయన చాలా నిస్సహాయంగా కనిపించారు' అని వ్యాఖ్యానించారు (Devendra Fadnavis, Uddhav Thackeray flight journey). ఠాక్రే వ్యాఖ్యల గురించి ఫడణవీస్ స్పందిస్తూ.. 'నేను విమానంలో ఒక మూలన కూర్చుని ఉన్నాను. నేను విమానం ఎక్కినప్పుడల్లా నా మొబైల్‌లో సినిమా లేదా సిరీస్ చూస్తుంటాను. శుక్రవారం విమానం ఎక్కిన దగ్గర్నుంచి దిగే వరకు అదే చేశాను. అలాంటప్పుడు నా నిస్సహాయతను ఆయన ఎక్కడ చూశాడు' అని ఫడణవీస్ ప్రశ్నించారు. అయినా తాను మనిషినని, తనకు రెక్కలు లేవని ఠాక్రే వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు (Maharashtra politics). 'నాకు మహారాష్ట్రలోని 14 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి (Fadnavis response). అలాగే నా పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. కాబట్టి నా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా ఉద్ధవ్‌జీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను. నేను ఎలాంటి ఊహాగానాలకూ ప్రాధాన్యం ఇవ్వను. వ్యక్తిగత వ్యాఖ్యల కంటే అభివృద్ధి, పరిపాలనే నా లక్ష్యం' అని ఫడణవీస్ పేర్కొన్నారు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి.. దాడులు నిలిపివేయాలని ఒప్పందం