నిన్న టీఆర్ఎస్
Actor ProfilePolitician

నిన్న టీఆర్ఎస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిన్న టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్.. రేపు హెచ్ ఆర్ ఎస్
Telugu Times14 Aug 2026
నిన్న టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్.. రేపు హెచ్ ఆర్ ఎస్

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల మÖసీ కష్టాలు త్వరలోనే తొలగుతాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకుస సీఎం శంకుస్థాపన సందర్భంగా నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. మÖసీ పునరుజ్జీవంతో జిల్లాలో కాలుష్యాన్ని తగ్గిస్తామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ (KCR), అంతకుముందు కిరణ్‌కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఈ జిల్లాకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే నిధులు వస్తున్నాయన్నారు. హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలవకముందే అవినీతి జరుగుతోందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పూటకో పేరు మార్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. నిన్న టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్, పేరు హెచ్‌ఆర్‌ఎస్ అవుతుంది. హెచఆర్ఎస్ అంటే హరీశ్‌రావు (Harish Rao) రాష్ట్ర సమితి . కేసీఆర్ పదేళ్లపాటు నల్గొండ జిల్లాను మోసం చేశారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు కట్టిస్తానన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. కేసీఆర్ పదేళ్లపాటు రేషన్‌కార్డులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తోంది. రేషన్‌కార్డు పై సన్నబియ్యం ఇచ్చే ప్రభుత్వం మరొకటి లేదు. ప్రతి గ్రామంలో 30-40 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. ఆయా ఇళ్లకు రూ.5లక్షల చొప్పున అందిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని 12 సీట్లనూ గెలుస్తాం అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు

న న న ట ఆర ఎస Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in