నేడు 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి
Actor ProfileCelebrity

నేడు 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి
AP7AM6 Jul 2026
నేడు 'పెద్ది' మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో 'మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' పేరుతో విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. 'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందునుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ ఈ వేడుకను ఘనంగా ప్లాన్ చేసింది.వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేశారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ వేదికగా చిత్రబృందం తమ ఆనందాన్ని ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోనుంది

న డ ప ద ద మ గ బ ల క బస టర ఈవ ట మ ఖ య అత థ గ చ ర జ వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in