నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్ చల్
Actor ProfileCelebrity

నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్ చల్

Total News1
Movie Updates0
Sources1
నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్ చల్
Sakshi16 Jun 2026
నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్ చల్

సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్‌ నాయకుడు వీరంగం సృష్టించడం స్థానికంగా కలకలం రేపింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ పోలీసు స్టేషన్ లోనే రక్షక భటులకు వార్నింగ్‌ ఇచ్చారు. నా ఇసుక ట్రాక్టర్లు ఎలా ఆపుతారా అని పోలీసులను బెదిరించారు. ఒళ్లు పగులుతుంది నీ‌ సంగతేంటో చూస్తానని పోలీస్‌ స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడు. కాగా గత కొంతకాలంగా ఆలేరు, బిక్కేరు వాగు, రాజపేట, మోటకొండూరు ప్రాంతల నుంచి ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. మోటకొండూరు మండలం వర్టూరు చెరువు నుంచి కూడా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇసుక రవాణాను అడ్డుకున్న వారిని సైతం కొంతమంది నేతలు ఇలానే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆలేరు కాంగ్రెస్ నాయకుడే ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ బెదిరింపుల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇసాకపట్నం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు) సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. (ఫోటోలు) విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు) సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు) హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు) YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు 22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

న ట ర క టర లన ఆప త ర క గ ర స న యక డ హల చల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in