
టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన విజువల్ వండర్ ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్రాంచైజీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఈ ‘బాహుబలి’ ప్రపంచం నుంచి అభిమానులకు ఒక ఊహించని బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన విజువల్ వండర్ ‘బాహుబలి’ (Baahubali). దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), రానా దగ్గుబాటి (Rana Daggubati) కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్రాంచైజీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రిలీజై ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ ‘బాహుబలి’ ప్రపంచం నుంచి అభిమానులకు ఒక ఊహించని బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ (Baahubali: The Torchbearer) పేరుతో ఒక ఎక్స్‌క్లూజివ్ డాక్యుమెంటరీ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. 2026 జూన్ 26న నేరుగా డిజిటల్ స్క్రీన్స్ పైకి రాబోతున్న ఈ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ‘బాహుబలి’ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్ కేవలం సినిమా విశేషాలు మాత్రమే కాదు.. అసలు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సాంస్కృతిక ప్రభావాన్ని చూపించిందనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాల వెనుక ఉన్న అసలైన విజన్ ఏంటి? షూటింగ్ సమయంలో జక్కన్న టీమ్ ఎదుర్కొన్న ప్రొడక్షన్ సవాళ్లు ఏంటి? అసలు మహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు? అనే ఆసక్తికరమైన విషయాలను ఇందులో రివీల్ చేయనున్నారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఎవరూ చూడని అరుదైన బిహైండ్ ది సీన్స్ (BTS) మేకింగ్ ఫుటేజ్, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రత్యేక ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. ఇటీవలే రాజమౌళి ‘RRR’ సినిమాకు సంబంధించిన మేకింగ్ డాక్యుమెంటరీ ఓటీటీలో మంచి