‘పుష్ప-2’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా 2024, ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన
నెట్టింట వైరల్ అవుతున్న భాగ్యశ్రీ
సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహం, ఆపై ప్రేమాయణం అనే వార్తలు రావడం చాలా సహజం. కొన్నిసార్లు ఈ ప్రచారాలు కేవలం పుకార్లుగానే మిగిలిపోతే, మరికొన్ని సార్లు నిజమై పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందానాల వివాహ బంధం ఇలాగే రూమర్స్‌తో మొదలై పెళ్లితో సుఖాంతమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సెట్స్‌లో చిగురించిన ప్రేమ?'మిస్టర్ బచ్చన్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, తొలి చిత్రంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా గ్లామర్‌తో కుర్రకారు మనసులను దోచుకుంది. ఆ తర్వాత ఆమె రామ్ పోతినేని సరసన 'ఆంధ్రా కింగ్' చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపనప్పటికీ, వీరిద్దరి మధ్య ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమ చిగురించిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో భాగ్యశ్రీ కోసమే రామ్ ప్రత్యేకంగా లిరిసిస్ట్, సింగర్‌గా మారాడనే వార్తలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేశాయి.* ఆ హీరో ప్రవర్తనకు కోపమొచ్చింది.. అడ్వాన్స్ ఇవ్వకుండానే వచ్చేశా: ఎస్వీ కృష్ణారెడ్డి సుమ టాక్ షోలో భాగ్యశ్రీ హింట్!ఈ ప్రేమ ప్రచారానికి ఆజ్యం పోసేలా తాజాగా భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'లెనిన్' చిత్ర ప్రమోషన్స్‌లో ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న టాక్ షోలో భాగ్యశ్రీ పాల్గొంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. "నా మొదటి ఇల్లు ఔరంగాబాద్ (మహారాష్ట్ర) అయితే, నా సెకండ్ హోమ్ హైదరాబాద్. అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది" అంటూ