నిజామాబాద్ జిల్లా అమీనాపూర్ లో మహిళ
Actor ProfilePolitician

నిజామాబాద్ జిల్లా అమీనాపూర్ లో మహిళ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిజామాబాద్ జిల్లా అమీనాపూర్ లో మహిళ, ఇద్దరు చిన్నారుల అదృశ్యం
Andhra Jyothy1 Aug 2026
నిజామాబాద్ జిల్లా అమీనాపూర్ లో మహిళ, ఇద్దరు చిన్నారుల అదృశ్యం

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్‌లో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడం సంచలనం సృష్టిస్తోంది. నిజామాబాద్: వేల్పూర్ మండలం అమీనాపూర్‌లో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడం సంచలనం సృష్టిస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న వేల్పూర్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇద్దరు పిల్లలతో సదరు మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. మహిళ సెల్‌ఫోన్‌కు పలుమార్లు కాల్ చేసినా స్విచ్‌ఆఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా ఎక్కడా ఆమె జాడ తెలియరాలేదు. దీంతో బంధువులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి వేల్పూర్ పోలీసులను బాధిత కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ, చిన్నారుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. వారి వివరాలు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని వేల్పూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: మంత్రి పొన్నం తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

న జ మ బ ద జ ల ల అమ న ప ర ల మహ ళ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in