న జనీవాకు ట్రంప్ వస్తారా? జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఉత్కంఠ
Actor ProfilePolitician

న జనీవాకు ట్రంప్ వస్తారా? జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఉత్కంఠ

Total News1
Movie Updates0
Sources1
న జనీవాకు ట్రంప్ వస్తారా? జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఉత్కంఠ
Sakshi15 Jun 2026
న జనీవాకు ట్రంప్ వస్తారా? జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఉత్కంఠ

వాషింగ్టన్‌: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారైనప్పటికీ, ఇప్పుడు ట్రంప్‌ ఎటువంటి మెలిక పెడతారో, చివరి నిముషంలో ఏం చేస్తారో అనే సందేహం ప్రపంచవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతోంది. అలాగే ఆయన జనీవా రాకపై సస్పెన్స్ నెలకొంది. మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే ఈ కీలక ఒప్పందంపై వచ్చే జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జనీవాలో సంతకాలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ట్రంప్ స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఒప్పందాన్ని తన ప్రభుత్వ దౌత్య విజయంగా భావిస్తున్నప్పటికీ, ఆయన నేరుగా వేదికపైకి వస్తారా అనే విషయంలో ట్రంప్ వైఖరి ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. ఈ సస్పెన్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము ఇంకా దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ వివరాలను పరిశీలిస్తున్నామని, తాను కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చెబుతూనే, అధ్యక్షుడు ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు దక్కిన విజయమని, దీనివల్ల దీర్ఘకాలంలో ఇంధన ధరలు భారీగా తగ్గి, మిడిల్ ఈస్ట్‌లో కొత్త శకానికి నాంది పడుతుందని వాన్స్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ రాకపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం దౌత్య వర్గాలలో చర్చనీయాంశమైంది. మరోవైపు, ఇరాన్ సైతం జూన్ 19న ఒప్పందం జరగనుందనే విషయాన్ని ధృవీకరిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంతకాల కార్యక్రమాన్ని వర్చువల్ (రిమోట్) పద్ధతిలో నిర్వహించే అవకాశం కూడా ఉందని గతవారమే స్పష్టం చేసింది. టెహ్రాన్ తరఫున ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాగర్ గాలిబాఫ్ లేదా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీలలో ఒకరు హాజరయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ వైపు నుంచి రిమోట్ సైనింగ్ ఆప్షన్ తెరపైకి రావడం

న జన వ క ట ర ప వస త ర జ డ వ న స వ య ఖ యలత ఉత క ఠ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in