
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా నటించింది. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో నేను పార్వతి అనే పాత్రలో కనిపిస్తాను. తను ఒక వేద విద్యార్థిని. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర నేను చేయలేదు. తన కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర చూసి ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో ఒక పాట గురించి అందరూ మాట్లాడుతున్నారు… అవును.. ఆ పాట చేయడం నిజంగా అద్భుతమైన అనుభవం. దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో ఆ పాటను గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అందులో క్లాసికల్ డాన్స్ కూడా ఉంటుంది. నిజంగా ఆ పాట బిగ్ స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. అది నాకు చాలా కొత్త అనుభవం. టెక్నికల్‌గా కూడా అంత పెద్ద కాన్వాస్‌పై ఆ పాటను చిత్రీకరించడం ఒక ఛాలెంజ్. అది కేవలం డాన్స్ సాంగ్ మాత్రమే కాదు… అందులో భక్తి భావం కూడా కనిపించాలని దర్శకుడు, కొరియోగ్రాఫర్‌కు ముందుగానే సూచించారు. ఆ పాట కోసం వేసిన సెట్ నిజంగా ఒక పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. బృందావనంలో గోపికలంతా కలిసి ఆనందంగా వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందో, ఆ సెట్లో పాట చిత్రీకరణ సమయంలో కూడా అలాంటి అనుభూతే కలిగింది. ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా జరిగింది. ఈ సినిమా కోసం నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ పాత్ర కోసం మీరు తీసుకున్న శిక్షణ లేదా జాగ్రత్తలు ఏంటి? అభిషేక్ నామ గారు కథ చెప్పినప్పుడే