
Nagabandham Review : విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాగబంధం’. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాణంలో అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగబంధం సినిమా జూలై 3న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. 1962లో హిమాలయాల్లో టెస్లా, అలీ(రిషభ్ సావ్నీ) కలిసి నాగబంధం అనే పుస్తకం కోసం వెతుకుతుంటారు. అది దొరకడంతో టెస్లా నాగబంధం తీసుకెళ్లి ఆర్కియాలజీ స్పెషలిస్ట్ ప్రభాకర్(జగపతిబాబు)కి ఇస్తాడు. అలీని అక్కడ ఓ భైరాగి వశం చేసుకొని ఆ పుస్తకం, బ్రహ్మకమలం కోసం పంపిస్తాడు. రుద్ర(విరాట్ కర్ణ) ఓ అనాథ అయినా తనని పెంచిన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తుంటాడు. శ్రీరంగపురంలో ఉండే రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి నాభిలో ఉండే పద్మంలో బ్రహ్మకమలం ఉంటుంది. అదే ఊళ్ళో పార్వతి(నభా నటేష్) ఆ ఆలయ అర్చకురాలి దగ్గర శిష్యురాలిగా ఉంటుంది. బ్రహ్మకమలంను ప్రభాకర్ మనిషి దొంగతనం చేసి తెచ్చివ్వడంతో అది తీసుకొని వెళ్తుండగా పాములు అడ్డుకుంటాయి. ఆ బ్రహ్మ కమలం కోసం కొంతమంది వెతుక్కుంటూ వచ్చి భైరవకోన నీళ్ళల్లో పడిపోయిందని రుద్రని డబ్బు ఆశ చూపించి సాయం అడుగుతారు. తన చెల్లి మానస(సోనియా సింగ్) పెళ్లి కోసం డబ్బు కావాల్సి రావడంతో ఒప్పుకొని వాళ్ళని తీసుకెళ్తాడు. కానీ రుద్రకు కూడా దొరికినట్టే దొరికి ఆ బ్రహ్మ కమలం మిస్ అవుతుంది. మరి ఆ బ్రహ్మ కమలం ఎక్కడుంది? రుద్ర బ్రహ్మ కమలం కోసం ఏం చేస్తాడు? అసలు ఆ బ్రహ్మ కమలంతో ఏం చేస్తారు? 1756లో జరిగిన కథకు 1962లో జరిగే కథకు సంబంధం ఏంటి? హిమాలయాల్లో ఉండే భైరాగి ఎవరు? అసలు