నాగబంధం చాలా కాస్ట్లీ సినిమా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి
Actor ProfileActor

నాగబంధం చాలా కాస్ట్లీ సినిమా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగబంధం చాలా కాస్ట్లీ సినిమా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి - నిర్మాత సురేష్ బాబు
Telugu Times30 Aug 2026
నాగబంధం చాలా కాస్ట్లీ సినిమా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి - నిర్మాత సురేష్ బాబు

నాగబంధం విజువల్ వండర్ లా ఉంటుంది. ఆడియన్స్ కి గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరో విరాట్ కర్ణ -నాగబంధం మన సంస్కృతి, మూలాలు, సనాతన ధర్మాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది: డైరెక్టర్ అభిషేక్ నామా -నాగబంధం ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్: నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నటుడిగా మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. సినిమా చూస్తే నేను ఎంత హార్డ్‌వర్క్ చేశానో మీకు అర్థమవుతుంది. మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయాలో 100 శాతం ఈ సినిమాకు చేశాను. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన అభిషేక్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు, కంటెంట్ చూపించినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇందులో మీరు చూస్తారు. మా నిర్మాతలు కిషోర్ గారు, నిశిత

న గబ ధ చ ల క స ట ల స న మ వ జ వల స అద భ త గ ఉన న య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in