
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విరాట్ కర్ణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే. కెరీర్ ప్రారంభంలోనే ఇంత భారీ సినిమాలు చేయడం ఎలా అనిపించింది? -అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తొలి సినిమా పెదకాపు కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఇప్పుడు నాగబంధం కూడా చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. పెదకాపు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. ఆ పాత్రకు కావాల్సిన ప్రతిదీ చేశాను. నటుడిగా మంచి ప్రసంశలు వచ్చాయి. ఆ సినిమా కంటే ఈ సినిమాకు రెట్టింపు కష్టపడ్డాను. నాగబంధం జర్నీ ఎలా ప్రారంభమైంది? -అభిషేక్ నామా గారు ఈ కథను సిద్ధం చేసుకుని, ఆ పాత్రకు తగ్గ నటుడి కోసం వెతుకుతున్నారు. ఆ పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న కొత్త వ్యక్తి అయితే బాగుంటుందని అనుకున్నారు. ఆ సమయంలో నన్ను పిలిపించి మాట్లాడారు. నాకు కథ చాలా నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యాను. అలా ఈ జర్నీ మొదలైంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే రూ.100 కోట్ల బడ్జెట్ అనుకున్నారా? లేదు. సినిమా డెవలప్ చెందుతున్న కొద్దీ కంటెంట్ డిమాండ్ ప్రకారం బడ్జెట్ సైజ్ పెరుగుతూ వచ్చింది. మీ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు? -ఈ కథ విన్నప్పుడే నా