నాగబంధం' కంటెంట్
Actor ProfileActor

నాగబంధం' కంటెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగబంధం' కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రూ.110 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను అద్భుతంగా నిర్మించాం
Telugu Times3 Aug 2026
నాగబంధం' కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రూ.110 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను అద్భుతంగా నిర్మించాం

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నాగబంధం ప్రాజెక్టులోకి మీరు ఎలా వచ్చారు? -మేము సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహించాం. అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత బిజినెస్‌ను డైవర్సిఫై చేయాలనే ఉద్దేశంతో సినిమా పరిశ్రమను కూడా ఒక మంచి అవకాశంగా భావించాం. నాగబంధం కంటే ముందు మరో కథ విన్నాం. అది చాలా పెద్ద హీరోతో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్. అయితే అప్పటికి మేము నిర్మాతలుగా నిరూపించుకోలేదు కాబట్టి ఆ అవకాశం రాలేదు. - రవీందర్ రెడ్డి గారు అభిషేక్ నామా గారి వద్ద ఉన్న స్క్రిప్ట్ గురించి చెప్పారు. అలా మేము అభిషేక్ గారిని కలిశాం. ఆయన విజన్ మాకు చాలా నచ్చింది. పెద్ద స్థాయిలో సినిమా చేయాలనే ఆలోచనతో నాగబంధం మొదలైంది. కథ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా నమ్మకం పెరిగింది. నాగబంధం కంటెంట్ పై వున్న నమ్మకంతో రూ.110 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాం. -మొదటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్‌పై మాకు ఆసక్తి ఉంది. అయితే కేవలం పేరు కోసం మేము ఈ రంగంలోకి రాలేదు. సాఫ్ట్‌వేర్ రంగంలోనే మేము మంచి గుర్తింపు సంపాదించాం. బిజినెస్‌ను విస్తరించే క్రమంలో రియల్ ఎస్టేట్, ఫార్మా లాంటి రంగాలతో పాటు సినిమా కూడా ఒక మంచి రంగమని

న గబ ధ క ట ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in