
సాక్షి, విజయవాడ: నా కొడుకు వస్తాడని ఎదురుచూశాను.. పోలీసులు అయితే చంపి తగలబెడతారా?.. నా కొడుకు ఉంటే ఇవ్వండి.. లేదంటే బూడిద అయినా ఇవ్వండి అంటూ సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నా కొడుక్కి రాజకీయాలు అంటగాట్టొద్దు.. న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదు.. కేవలం సీఐ నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీఐ నాగరాజు నా కొడుకును చంపేస్తా అని చెప్పాడు. స్టేషన్లో కుర్రాళ్ళను కొడుతుంటే తట్టుకోలేక పోయాను. నా కొడుకును చూపించమని అడిగితే చూపించలేదు. బాబురావు అనే వ్యక్తి నా కొడుకును ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలి. నా కొడుకును కొట్టి బాత్ రూమ్లో పడేశాడు. నా కొడుకు వస్తాడని ఎదురు చూస్తున్నాను. నాకు సపోర్టుగా నిలిచినా వ్యక్తిపై నిందలు వేస్తున్నారు. పోలీసులు అయితే చంపి తగలబెడతారా?. నా కొడుకు ఉంటే ఇవ్వండి.. లేదా బూడిద ఇవ్వండి. నా కొడుక్కి రాజకీయాలు అంటగాట్టొద్దు. మాకు న్యాయం చేయండి. పిల్లోడినీ చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి నా కొడుకును చంపే అధికారం, ధైర్యం ఎవడిచ్చాడు? అని ప్రశ్నించారు. దొంగ రాజకీయాలు చేయవద్దు అంటూ మండిపడ్డారు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ..‘మాకు న్యాయం జరగాలి. రాజకీయాలు చేయడానికి, బెదిరించడానికి వచ్చింది అమ్మిశెట్టి వాసు. మేము పోలీసులకు వ్యతిరేకం కాదు.. కేవలం నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం. స్టేషన్ మొత్తం ఈ కేసులో వున్నారు. రభుత్వం సుమోటగా కేసు తీసుకొని న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. అడ్వకేట్ కనకదుర్గ మాట్లాడుతూ..‘సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో తీసుకొచ్చి కొట్టారు. రాజకీయాలకు సాయికృష్ణకు సంబంధం లేదు. దమ్ముంటే