నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె.. తన గుండెల్లో బాధ ఉన్నా చిరునవ్వుతో కట్టిపడేస్తుంది.. తనికెళ్ల భరణి
Actor ProfilePolitician

నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె.. తన గుండెల్లో బాధ ఉన్నా చిరునవ్వుతో కట్టిపడేస్తుంది.. తనికెళ్ల భరణి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె.. తన గుండెల్లో బాధ ఉన్నా చిరునవ్వుతో కట్టిపడేస్తుంది.. తనికెళ్ల భరణి
TV9 Telugu5 Aug 2026
నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె.. తన గుండెల్లో బాధ ఉన్నా చిరునవ్వుతో కట్టిపడేస్తుంది.. తనికెళ్ల భరణి

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శకుని పాత్రను “అనుకూల శత్రువు”గా వివరిస్తూ, అతనిలోని సంక్లిష్టతను తెలియజేశారు. కౌరవులతో ఉంటూనే వారి నాశనాన్ని కోరుకున్న శకుని, తన సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడని అన్నారు. తన తండ్రి వెన్నుముకతో పాచికలు తయారుచేసి, వాటితో కౌరవ సంహారాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ పాత్రలో ఉన్న కఠినత్వం, ఆవేశం, అంతర్గత సంఘర్షణ దానిని ఒక చిరస్మరణీయమైన పాత్రగా నిలుపుతుందని వివరించారు. సినీ రంగంలో శకుని పాత్రధారణ గురించి మాట్లాడుతూ, ముదిగొండ లింగమూర్తి ,చిలకలపూడి సీతారామాంజనేయులు (CSR) మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఉదహరించారు. KV రెడ్డి శకుని పాత్ర కోసం తొలుత ముదిగొండ లింగమూర్తి పేరును సూచించినప్పటికీ, చివరికి CSR ని ఎంచుకున్నారు. CSR లో “కొంచెం ఎంటర్టైన్మెంట్” కూడా ఉందని, అది శకుని పాత్రకు మరింత మెరుగులు దిద్దుతుందని కెవీ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిపారు. ఇది అప్పటి దర్శకుల వృత్తి నైపుణ్యం, వారి దూరదృష్టిని తెలియజేస్తుంది. ముదిగొండ లింగమూర్తి త్యాగయ్య, వేమన, పోతన, మహామంత్రి తిమ్మరుసు వంటి ఎన్నో గొప్ప పాత్రలను పోషించిన మహానటుడని, కెవీ రెడ్డికి రైట్ హ్యాండ్ అని కూడా ఈ సందర్భంలో ప్రస్తావించారు. అలాగే తనకు ఇష్టమైన హీరోయిన్ అలనాటి దిగ్గజ నటి రేఖ అని అన్నారు. ఆమె పట్ల ఉన్న విశేష ఆరాధనను, గౌరవాన్ని వెల్లడించారు. ఆమెను ఒక “గొప్ప తత్వవేత్త”గా వర్ణిస్తూ, ఆమె జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని లోతుగా విశ్లేషించారు. రేఖపై రాసిన కవితను పఠిస్తూ, ఆమె కళ్ళు “కామసూత్ర కాసారం” , “కరుణారస సాగరం” అని వర్ణించారు. ఆమె గుండెల్లో “కుతకుతలాడుతున్న లావా” ఉందని, చీకటిని పాయలుగా దువ్వి వేసినట్టున్న ఆమె “కృష్ణవేణి వంటి జడ”ను, దాని చివర వేలాడే “ప్రేక్షక హృదయాలు లాంటి జడగంటలు” గురించి వివరించారు. ఆమె చూపు మార్మికంగా, నవ్వు

న క చ ల ఇష టమ న హ ర య న ఆమ తన గ డ ల ల బ ధ ఉన న చ ర నవ వ త కట ట పడ స త ద తన క ళ ల భరణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in