నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్
Actor ProfileActor

నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్
Sakshi15 Aug 2026
నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్

బంగారం, వెండి ధరలు పెరుగుతాయని సూచించే రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తాను బంగారం ధరల విషయంలో చేసిన అంచనా తప్పిందని, ధరలు ఇంకా తగ్గిపోతాయని కియోసాకి నిజాయితీగా అంగీకరించారు. అయితే.. మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని, పెరుగుదలతో పాటు పతనం కూడా సహజమేనని పేర్కొన్నారు. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న వేళ ఈ ట్వీట్ చేశారు. పెట్టుబడుల్లో అసలు లాభం అమ్మే సమయంలో కాకుండా, సరైన సమయంలో కొనుగోలు చేసినప్పుడే ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో అవి 35 వేల డాలర్ల (ఔన్సు) స్థాయికి చేరుతాయని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టే వారే నిజమైన సంపదను సృష్టించగలరని, రోజువారీ ధరల మార్పులను చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని సూచించారు. అంతే కాకుండా.. తప్పులు చేయడం సహజమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే విజయానికి దారి తీస్తుందని చెప్పారు. ఎలాంటి తప్పులు చేయని వారు కొత్త విషయాలు నేర్చుకోలేరని, పెట్టుబడిదారులు ఓర్పు, దీర్ఘకాలిక ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. భారతదేశంలో బంగారం ధరలు మన దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (జూన్ 29) కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.850 (22 క్యారెట్స్), రూ.930 (24 క్యారెట్స్). దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు కొంత పతనమయ్యాయి. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్‌.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు) #RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

న అ చన తప ప ద క య స క ట వ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in