నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి
Actor ProfilePolitician

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి
Andhra Jyothy19 Jun 2026
నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. నల్లగొండ, జూన్ 19: జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద ఈరోజు(శుక్రవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తండ్రీకొడుకులతో పాటు మరొకరు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన తండ్రీకొడుకులు పల్నాడు జిల్లా ముప్పల్ మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల థామస్య(51), ప్రకాష్ రావు (35)గా గుర్తించారు. మరోవ్యక్తి వరంగల్ ఎస్‌ఎల్‌బీసీ(SLBC) సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయికుమార్(20)గా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరాన్‌తో అమెరికా డీల్.. మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు