నమ్మలేని నిజం.. ఇంత పెద్ద కెరీర్ ఉన్నా ఒక్క టీ20లోనూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలవని
Actor ProfileActor

నమ్మలేని నిజం.. ఇంత పెద్ద కెరీర్ ఉన్నా ఒక్క టీ20లోనూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలవని

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నమ్మలేని నిజం.. ఇంత పెద్ద కెరీర్ ఉన్నా ఒక్క టీ20లోనూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలవని
TV9 Telugu8 Sept 2026
నమ్మలేని నిజం.. ఇంత పెద్ద కెరీర్ ఉన్నా ఒక్క టీ20లోనూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలవని

Rare Records : ఫాస్టెస్ట్ ఫార్మాట్ అయిన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక్క ఓవర్ లేదా కొన్ని బంతుల్లో చేసే మెరుపు ప్రదర్శన కూడా ఒక ఆటగాడిని రాత్రికి రాత్రే హీరోగా మార్చేస్తుంది. కొన్నిసార్లు కేవలం 20-30 పరుగులు చేసినా లేదా రెండు కీలక వికెట్లు తీసినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కుతుంటాయి. అయితే, ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు, వారు తమ దేశాల తరఫున ఎన్నో ఏళ్ల పాటు విజయవంతమైన కెరీర్‌ను సాగించారు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించారు. కానీ, తమ సుదీర్ఘ టీ20 కెరీర్‌లో ఒక్కసారి కూడా ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోలేకపోయారు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అలా అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క అవార్డు కూడా గెలవని ఐదుగురు ప్రముఖ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. ఈ జాబితాలో అందరినీ అత్యంత ఎక్కువగా ఆశ్చర్యపరిచే పేరు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే టీమిండియా 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడింది. ధోనీ భారత్ తరఫున ఏకంగా 98 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తూ ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో భారత్‌ను గెలిపించాడు. వికెట్ కీపర్‌గా మెరుపు స్టంపింగ్స్‌తో రికార్డులు సృష్టించాడు. ఇంతటి అద్భుతమైన, సుదీర్ఘమైన కెరీర్ ఉన్నప్పటికీ, ధోనీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకోలేకపోవడం నిజంగా ఒక వింతైన రికార్డు అనే చెప్పాలి. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ గెలవడానికి స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్‌లే కారణం. ఆయన తన టీ20 కెరీర్‌లో 43 మ్యాచ్‌లు