నమస్తే తెలంగాణ’ కథనాలతో రామన్నపేట అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఔట్.. ఆనందంలో ప్రజలు
Actor ProfileActor

నమస్తే తెలంగాణ’ కథనాలతో రామన్నపేట అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఔట్.. ఆనందంలో ప్రజలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నమస్తే తెలంగాణ’ కథనాలతో రామన్నపేట అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఔట్.. ఆనందంలో ప్రజలు
Namasthe Telangana23 Jun 2026
నమస్తే తెలంగాణ’ కథనాలతో రామన్నపేట అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఔట్.. ఆనందంలో ప్రజలు

Adani Cement Factory | యాదాద్రి భువనగిరి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. దాని స్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు యాదాద్రి కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. వాస్తవానికి రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో ఆ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో రామన్నపేటతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే రామన్నపేట కాలుష్యపు కోరల్లో కొట్టుమిట్టాడుతుందని ఆందోళన చెందారు. అదానీ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అఖిల పక్షంగా ఏర్పాటై ముక్తకంఠంతో నినదించారు. కాగా ప్రజా సమస్యను నమస్తే తెలంగాణ అక్షర బద్ధం చేసింది. నిత్యం కథనాలు ప్రచురించి అక్షర కవాతుగా నిలిచింది. అప్పటి వరకు రామన్నపేటకే పరిమితమైన అంశాన్ని రాష్ట్రవ్యాప్తం చేసింది. జనం గోడును రాష్ట్ర ప్రభుత్వం ఆలోచింపచేసేలా చేసింది. అదానీ కంపెనీ రైతులను ఎలా మోసం చేసింది..? ఫ్యాక్టరీ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి..? కాలుష్యం ఎలా కోరలు చాస్తుంది..? రామన్నపేట ఎట్ల ఆగం అవుతుంది..? మూసీ మరింత మురికికూపంగా ఎలా మారుతుంది..? పేదల ఉపాధికి ఎట్ల గండి పడుతుంది..? ఇలా అనేక కోణాల్లో పూసగుచ్చినట్లు నిత్యం కథనాలను ప్రచురించింది. ప్రజలను చైతన్యం చేయడంతోపాటు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లింది. ప్రతి రోజు స్థానికుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన వార్తలను తొలి ప్రాధాన్యంగా తీసుకొని బాధితులకు వెన్నుగా నిలిచింది. ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు అనేక మంది ప్రముఖులు స్పందించేలా చేసింది. ఈ క్రమంలోనే కొంత కాలంగా అదానీ సంస్థ తమ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా అదానీ తమ

నమస త త ల గ ణ కథన లత ర మన నప ట అద న స మ ట ఫ య క టర ఔట ఆన ద ల ప రజల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in